English | Telugu

రామ్ చ‌ర‌ణ్ కుమార్తెకు అల్లు అర్జున్ కాస్ట్‌లీ గిఫ్ట్‌

కొణిదెల కుటుంబ స‌భ్యులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అందుకు కార‌ణమేంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారింట్లోకి కొత్త మెంబ‌ర్ అడుగు పెట్టారు. అదెవ‌రో కాదు.. క్లీంకార‌. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల గారాల ప‌ట్టి. జూన్ 20న క్లీంకార మెగా ఇంట్లోకి అడుగు పెట్టింది. మెగా కుటుంబ స‌భ్యులు, అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. పాప పుట్టిన త‌ర్వాత బార‌సాల వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు, స్నేహితులు అంద‌రూ పాల్గొన్నారు. ఖ‌రీదైన బహుమ‌తులను అందించారు. అయితే వీరిలో అల్లు అర్జున్ ఇచ్చిన ఖ‌రీదైన గిఫ్ట్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఐకాన్ స్టార్ మెగా వార‌సురాలికి ఇచ్చిన బ‌హుమానం ఏంటో తెలుసా!

స‌మంత‌కు ఇర‌వై కోట్లు సాయం చేసిన తెలుగు స్టార్ హీరో!

తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిగా త‌న‌దైన ముద్ర వేసిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాల‌కు, షూటింగ్స్‌కు దూరంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటోంది. యోగ‌, వ్యాయామాలు చేస్తూ ఆధ్యాత్మిక సేవ‌లో ఉంటోంది. అలాగే స్నేహితుల‌తో క‌లిసి విహార యాత్ర‌ల‌కు వెళుతుంది. ఇదంతా బాగానే ఉంది కానీ, స‌మంత‌కు సంబంధించిన రూమర్స్ ఈ మ‌ధ్య నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు స‌మంత‌కు సంబంధించి మ‌రో విష‌యం కూడా వైర‌ల్ అవుతోంది. అదేంటంటే..ఆమె టాలీవుడ్‌కి చెందిన ఓ హీరో నుంచి ఆర్థిక సాయం అందుకుంద‌ట‌. ప్ర‌స్తుతం ఆమె సినిమాలు ఏం చేయ‌టం లేదు. మయోసైటిస్ చికిత్స తీసుకుంటుంది. అందుకోసం ఆమె అమెరికా వెళ్లాల్సి ఉంది. భారీగా ఖ‌ర్చు అవుతుంది ఆ ఖ‌ర్చు కోసం ఆమె టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరో నుంచి దాదాపు ఇర‌వై కోట్లు డ‌బ్బును అప్పుగా తీసుకుంద‌ని టాక్ వినిపిస్తోంది.

హిట్ కోసం నాగ చైత‌న్య ప్ర‌య‌త్నాలు

అక్కినేని నేటి త‌రం న‌ట వార‌సుడు నాగ చైత‌న్య‌కు మంచి హిట్ వ‌చ్చి చాలా కాల‌మే అవుతుంది. మంచి ఆశ‌ల‌ను పెట్టుకున్న‌క‌స్ట‌డీ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడీ హీరో త‌న నెక్ట్స్ మూవీపై ఫుల్ ఫోక‌స్ పెట్టారు. ఎలాగైనా హిట్ ద‌క్కించుకోవాల‌ని తెగ క‌ష్ట‌ప‌డుతున్నార‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే, నాగ చైత‌న్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై సినిమాను రూపొందించ‌నున్నారు.

‘సలార్’ ఇంగ్లీష్ వెర్ష‌న్ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యిందా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ‘సలార్’ ఒక‌టి. KGF వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌టం కూడా సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. హోంబలే ఫిలింస్ మూవీని నిర్మిస్తోంది. సెప్టెంబ‌ర్ 28న సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స‌య్యింది. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాలు సైతం ‘సలార్’ రాక కోసం ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి. ఎందుకంటే సినిమాకు మాస్ అప్పీల్ ఉండటంతో సినిమా వ‌సూళ్ల ప‌రంగ ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

సూర్య రూ.600 కోట్ల సినిమా!

పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు ఉన్న క‌థానాయ‌కుడు సూర్య‌. విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌తో ఆయ‌న త‌న‌దైన క్రేజ్‌, ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సూర్య త‌న సినిమాల‌ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న కంగువా సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దాని త‌ర్వాత వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వాడివాస‌ల్ సినిమా లైన్‌లో ఉంది. అయితే తాజాగా సూర్య లైనప్‌లో మ‌రో భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి తెలిసింది. అదేంటంటే.. ఈ వెర్స‌టైల్ యాక్ట‌ర్ బాలీవుడ్ మేక‌ర్‌తో భారీ బ‌డ్జెట్ మూవీ చేయ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఇంత‌కీ వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ సినిమా బ‌డ్జెట్ రూ.600 కోట్లు.

ప్ర‌భుదేవా కోసం మ‌క్క‌ల్ సెల్వ‌న్ కొత్త అవ‌తారం

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్రభుదేవా లేటెస్ట్ మూవీ ‘వూల్ఫ్’. వినూ వెంకటేష్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల‌తో పాటు క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ టీజ‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కాగా.. ఇందులో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి కూడా భాగం అవుతున్నారు. అంటే ఈ విల‌క్ష‌ణ న‌టుడు యాక్ట‌ర్‌గా ఎలాంటి పాత్ర‌ల్లో మెప్పించారో మ‌న అంద‌రికీ తెలిసిందే. అలాంటి న‌టుడు ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ క్రియేట్ కావ‌చ్చు. కానీ అస‌లు విష‌యం ఏంటంటే..వూల్ఫ్ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి భాగం అవుతున్న‌ది నిజ‌మే. అయితే యాక్ట‌ర్‌గా మాత్రం కాదు.. టెక్నీషియ‌న్‌గా.

క‌ర్ణాట‌క సీఎం బ‌యోపిక్‌లో విజ‌య్ సేతుప‌తి?

చాలెంజింగ్ రోల్స్ గురించి ఎక్క‌డ విన్నా, వెంట‌నే విజ‌య్ సేతుప‌తి పేరు కూడా వినిపించి తీరుతుంది. సూప‌ర్ డీల‌క్స్ నుంచి విజ‌య్ సేతుప‌తి చేయ‌ని రోల్ లేదు. వైవిధ్యమైన కేర‌క్ట‌ర్ల‌ను రాసుకున్నవారికి ఫ‌స్ట్ ఆప్ష‌న్‌గా మారుతున్నారు మిస్ట‌ర్ సేతుప‌తి. క‌న్న‌డ సీఎం సిద్ధ‌రామ‌య్య బయోపిక్‌లో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తార‌నే వార్త స్పీడ్‌గా వైర‌ల్ అవుతోంది. సిద్ధ‌రామ‌య్య బ‌యోపిక్ టాక్స్ లో ఉన్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో పాటు విజ‌య్ సేతుప‌తి పేరు కూడా వైర‌ల్ అవుతోంది. రెండు పార్టులుగా ఈ బ‌యోపిక్‌ని తెర‌కెక్కించ‌నున్నారు. లీడ‌ర్ రామ‌య్య అనే పేరుతో తెర‌కెక్కించ‌నున్నారు. ఎ కింగ్ రెయిజ్డ్ బై పీపుల్ అనేది ట్యాగ్ లైన్‌గా మార‌నుంది. స‌త్య‌ర‌త్నం ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్నారు. పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి కాగానే  రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టేలా ప్లానింగ్ జ‌రుగుతోంది.