‘సౌండ్ పార్టీ’ పోస్టర్ను లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత!
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రొడక్షన్ నెం. 1, వి.జె.సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తున్న నూతన చిత్రం, ‘సౌండ్ పార్టీ’. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.