English | Telugu
‘భోళా శంకర్’ ఫ్లాప్‌పై విజయ్ దేవరకొండ రియాక్షన్
Updated : Aug 22, 2023
అభిమానులు ముద్దుగా రౌడీ స్టార్ అని పిలుచుకునే విజయ్ దేవరకొండ రానున్న సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో థియేటర్స్‌లో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. సమంత తెలుగు ప్రమోషన్స్ వరకు చేసేసి అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఖుషి ప్రమోషనల్ యాక్టివిటీస్ అంతటినీ విజయ్ దేవరకొండ మాత్రమే చూసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన తమిళనాడులో తన సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటున్నారు. అక్కడ మీడియా జైలర్ గురించి ప్రశ్నించినప్పుడు పనిలో పనిగా చిరంజీవి భోళా శంకర్ విడుదలై ఫ్లాప్ అయ్యింది. దానికి ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే చిరంజీవికి మద్దుతుగా రౌడీ స్టార్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అసలు చిరంజీవిని ఉద్దేశించి విజయ్ దేవరకొండ ఏమన్నారంటే ‘‘రజినీకాంత్, చిరంజీవి వంటి హీరోల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవిగారు వచ్చి ఎంటైర్ తెలుగు సినీ ఇండస్ట్రీ రూట్‌ను మార్చేశారు. అప్పటి వరకు ఉన్న యాక్టింగ్, డాన్సింగ్‌ను స్టైల్‌ను మార్చేశారు. ఆయనకు ఆరేడు ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ఆయన మనసు పెట్టి రంగంలోకి దిగితే.. సరైన డైరెక్టర్‌ను ఆయన కలిస్తే ఆ సినిమా మరో రేంజ్‌లో ఉంటుంది. కాబట్టి చిరంజీవిగారు, రజినీకాంత్‌గారు వంటి హీరోల రేంజ్‌ను సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను బేస్ చేసుకుని అంచనా వేయకూడదు’’ అని క్లియర్‌గా చిరు అభిమానాన్ని చాటుకున్నారు.
మెగాస్టార్‌కి మద్దుతగా రౌడీ స్టార్ మాట్లాడిన తీరు చూసిన మెగాభిమానులు ఎంతో ముచ్చటపడుతున్నారు. ఖుషి సినిమా పెద్ద సక్సెస్ కావాలని విషెష్ చెబుతున్నారు.