ఓటీటీలో 'బేబీ' సందడి!
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై 14 న విడుదలై యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.