English | Telugu
పవన్ కళ్యాణ్‌తో లక్కీ ఛాన్స్ కొట్టేసిన సాక్షి వైద్య!
Updated : Aug 22, 2023
ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ డాల్ సాక్షి వైద్య. ఈ అమ్మడు ఎన్నో ఆశలతో చేసిన ఆ సినిమా డిజాస్టర్ కావటంతో అమ్మడు నిరాశకు లోనైంది. అదే సమయంలో వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు మూవీ గాండీవధారి అర్జున నుంచి పిలుపు రావటం నటించటం జరిగిపోయాయి. ఇప్పుడీ సినిమా ఆగస్ట్ 25న రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత ఈ డిల్లీ బ్యూటీ ఏం చేయనుందా? అనే అనుమానాలు చాలానే వచ్చాయి. అయితే వాటన్నింటికీ ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. ఆసక్తికరమై విషయమేమంటే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఒకరేమో శ్రీలీల. ఇప్పుడు సాక్షి వైద్య తాను కూడా నటిస్తున్నట్లు చెప్పింది. తమిళ చిత్రం తెరి రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తెరిలో ఇద్దరు హీరోయిన్స్. ఒకరు సమంత కాగా.. మరొకరు ఎమీ జాక్సన్. సమంత రోల్ ఫ్లాష్ బ్యాక్‌లో విజయ్ భార్యగా కనిపిస్తుంది. ఎమీ జాక్సన్ పాత్ర మాత్రం ఫ్లాష్ బ్యాక్‌లో అస్సలు కనిపించదు. మరి ఈ రెండు పాత్రల్లో సాక్షి వైద్య ఏ రోల్‌లో కనిపించనుందా? అని ఆలోచనలోపడ్డారు.
తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు.. సమంత చేసిన పాత్రలోనే సాక్షి వైద్య నటిస్తుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే నిజంగానే ఆమెకు మంచి పాత్ర వచ్చినట్లే అనుకోవాలి. ఇద్దరు హీరోయిన్స్‌లో సాక్షి వైద్య ఇలాంటి పాత్ర రావటం ఆమె లక్కేనని టాక్. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీకరణ మొదలు కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.