English | Telugu
మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్... డబుల్ ధమాకా!
Updated : Aug 22, 2023
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 22ని ఎంతో ఉత్సాహంగా, మరెంతో సందడిగా సెలబ్రేట్ చేసుకుంటారు అభిమానులు. ప్రతి సంవత్సరం మెగాస్టార్ పుట్టినరోజుకు ఆయన సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ఉంటూనే ఉంటుంది. అది ప్రొడక్షన్ లో ఉన్న సినిమాకి సంబంధించిన అప్ డేట్ కావచ్చు, కొత్త సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ కావచ్చు. అందుకే మెగాభిమానులంతా చిరు బర్త్ డే కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈసారి మెగాస్టార్ బర్త్ డేకి ఓ స్పెషాలిటీ ఉంది. అదేమిటంటే మెగాభిమానులకుచిరు డబుల్ ధమాకా ఇచ్చారు. ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్స్ వచ్చాయి.
మెగాస్టార్ 156వ సినిమాను ఆయన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మించనుందని గత కొంతకాలంగా వినిపిస్తున్న విషయాన్నే ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్పతాకంపై సుష్మిత నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది ఇప్పటి వరకు రివీల్ చెయ్యలేదు. దీనికి సంబంధించిన అప్ డేట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
ఇక మెగాస్టార్ 157వ సినిమాకి సంబంధించిన మరో అప్ డేట్ కూడా వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన డిఫరెంట్ మూవీ బింబిసార దర్శకుడు వశిష్ట ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఎంత భారీగా ఉండబోతోందనే విషయాన్ని ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లోనే తెలియజేశారు దర్శకుడు. ఒక నక్షత్రం చుట్టూ పంచభూతాల్ని చూపుతూ చేసిన ఈ పోస్టర్ సినిమా గురించి ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మరి మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఎనౌన్స్ చేసిన ఈ రెండు సినిమాలు ఎలాఉండబోతున్నాయి, ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాయో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.