English | Telugu

పుట్టినరోజు సందర్భంగా మెగాభిమానులకు ‘చిరు’ కానుక?

ఎంత టాలెంట్ వున్నా సినిమా రంగంలో హీరోగా నిలదొక్కుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందునా ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా హీరోగా సక్సెస్అవ్వడం అసాధ్యమనే చెప్పాలి. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా దిగ్గజాలుగా చెప్పబడే కొందరు హీరోలుఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో మెరుపుతీగలా వచ్చి మాస్ హీరోకి, కమర్షియల్ హీరోకి కొత్త అర్థం చెప్పారు చిరంజీవి. ప్రాణం ఖరీదు చిత్రంతో పరిచయమైన చిరంజీవి45 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, మరెన్నో బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నారు. కమర్షియల్ సినిమా అంటే ఇదీ అని తన సినిమా కలెక్షన్లతోప్రూవ్ చేసారు. కేవలం స్వయంకృషితో హీరోగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన మెగాస్టార్ ఎంతోమందికి ఆదర్శం.

అన్నయ్యా అని అందరూ ప్రేమగా పిలుచుకునే చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ని ఖైదీ నంబర్ 150తో స్టార్ట్ చేసి 60 ఏళ్ళు పైబడ్డా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదనిప్రూవ్ చేసారు. తన స్టెప్పులతో, యాక్షన్ తో ప్రేక్షకులను, అభిమానులను మెస్మరైజ్ చేశారు. ఉయ్యాల నరసింహారెడ్డి జీవిత చరిత్రను సినిమా తియ్యాలన్న తన చిరకాలకోరికను సైరా నరసింహారెడ్డి చిత్రంతో తీర్చుకున్నారు. తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ కి తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం ఆ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత.
ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళాశంకర్.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్. ఇప్పుడు మెగాస్టార్ చేయబోయే 156, 157 చిత్రాలకు సంబంధించిన అప్ డేట్స్ పైనే అందరి దృష్టీ ఉంది. ప్రతి సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకి ఏదో ఒక విశేషంఉండనే ఉంటుంది.

మరి ఈసారి మెగాభిమానులకు చిరు అందించే గిఫ్ట్ ఏమిటి అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఆగస్టు 22న మెగాస్టార్బర్త్ డే సందర్భంగా తను చేయబోయే కొత్త సినిమాల తాలూకు న్యూస్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు మెగాస్టార్ 156వ సినిమాకుకళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అలాగే 157వ సినిమాను బింబిసార దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ రెండు సినిమాల్లోదేనికి సంబంధించిన న్యూస్ ను ఆగస్టు 22న ఎనౌన్స్ చేస్తారు? లేదా రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను అందిస్తారా? అనేది తెలియాలంటేమంగళవారం వరకు వేచి చూడాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.