English | Telugu
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సముద్రం బ్యాక్ డ్రాప్ తో మూవీ తెరకెక్కుతోంది. ఇందులో తారక్ డ్యూయెల్ రోల్ అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్ డేట్ బయటకు పొక్కింది. అదేంటంటే.. ఇందులో అండర్ వాటర్ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ముంబై నుంచి స్పెషల్ ట్రైనర్స్ ను మేకర్స్ రప్పించారు.
హీరోయిన్లకు కాస్టింగ్‌కౌచ్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఎంతో మంది హీరోయిన్లు దానివల్ల పడిన ఇబ్బందుల్ని, చేదు అనుభవాల్ని అందరికీ తెలిసేలా చెప్పారు.
సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ చాలా సాధారణ విషయం. ఎందరో స్టార్ హీరోల కుమారులు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు మాత్రం హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయమవుతుండటం ఆసక్తికరంగా మారింది.
ఈమధ్యకాలంలో పాత సినిమాలను రీరిలీజ్ చెయ్యడం అనే సంప్రదాయం మొదలైంది. ఇటీవలికాలంలో చాలా సినిమాలు రీరిలీజ్‌లోనూ రికార్డులు సృష్టించాయి. ఇప్పుడా వరసలో మరో క్లాసిక్ మూవీ వచ్చి చేరింది. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని స్టా
'ఆర్ ఎక్స్ 100' (2018) తరువాత సరైన విజయం కోసం చకోర పక్షిలా వేచి చూస్తున్న హీరో కార్తికేయకి.. ఎట్టకేలకు అలాంటి హిట్ బొమ్మ పడినట్టే కనిపిస్తోంది. తాజా చిత్రం 'బెదురులంక 2012'కి వస్తున్న వసూళ్ళే ఇందుకు నిదర్శనం.
ఒక సినిమా సూపర్‌హిట్ అవ్వాలి, కలెక్షన్లు కొల్లగొట్టాలి అంటే అది కేవలం భారీ బడ్జెట్ వల్లే అవుతుందనేది వాస్తవం కాదు. తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ కొన్ని రెట్లు లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.
దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా వెండితెరపై వెలుగులు పంచుతున్నారు సుమన్. ఈ ప్రయాణంలో పలు విభిన్న పాత్రల్లో సందడి చేశారీ అందాల నటుడు. కథానాయకుడిగానే కాకుండా సహాయ నటుడిగానూ, ప్రతినాయకుడిగానూ తనదైన ముద్రవేశారు. 80ల్లో, 90ల్లో అయితే.. స్టార్ హీరోగా ఓ రేంజ్ చూశారాయన.
‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయితేజ్ చేసిన ‘బ్రో’ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి. ఈసారి పూర్తి మాస్ ఎంటర్టైనర్ చేసేందుకు సిద్ధమయ్యారు
స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగితే థియేటర్ల దగ్గర ఉండే సందడే వేరు. అయితే ఇప్పుడు రీరిలీజ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వార్ కి దిగుతున్నాయి. ఈ వారం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతుండటం విశేషం.
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'జైలర్'.. మూడో వీకెండ్ లోనూ జోరు చూపించింది. శని, ఆది వారాల్లో ఈ సినిమా పలు చోట్ల వసూళ్ళ వర్షం కురిపించింది. దీంతో 'జైలర్' గ్రాస్ రూ. 571 కోట్లకు చేరుకుంది. ఇక షేర్ లెక్కల్లో చూస్తే.. రూ. 279 కోట్లు ఆర్జించింది ఈ సెన్సేషనల్ మూవీ. అదే విధంగా.. లాభాల పరంగా చూస్తే రూ. 155.05 కోట్ల వరకు క్రెడిట్ అయినట్లే. ఓవరాల్ గా.. సూపర్ స్టార్ నుంచి తమిళ చిత్ర పరిశ్రమకి మరో ఇండస్ట్రీ హిట్ అందినట్లే అన్నది ట్రేడ్ టాక్.
‘అర్జున్‌రెడ్డి’ రిలీజ్ అయినప్పటి నుంచి విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిశ్శబ్ద యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సందర్భం ఉన్నా, లేకున్నా విజయ్‌పై సోషల్ మీడియాలో అనసూయ ఏదో ఒక కా
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీపై పవన్ అభిమానుల్లో మాత్రమే కాకుండా యాక్షన్ ప్రియుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. పవర్ స్టార్ అసలుసిసలు బాక్సాఫీస్ స్టామినాని తెలిపే సినిమా ఇదవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లు, సెట్స్ లో పవన్ ఫోటోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి అదిరిపోయే ట్రీట్ రాబోతుంది.
మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాలన్నీ వరుస డిజాస్టర్స్ అవుతున్నాయి ఈ మధ్య. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' భారీ నష్టం చూస్తే.. నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'ది అంతకంటే ఘోరమైన పరిస్థితి. ఈ వరుసలోనే తాజాగా 'గాండీవధారి అర్జున' కూడా చేరింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్ళ పరంగానూ నిరాశపరుస్తోంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌కి ఇటీవల నందమూరి మోక్షజ్ఞ వచ్చారు. హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడితో
కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన శ్రీలీల అక్కడ ఓ అరడజను సినిమాలు చేసేసింది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా హీరోయిన్గా మంచి పేరే తెచ్చుకుంది. పెళ్లిసందడి, ధమాకా చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.