English | Telugu
'జైలర్' 18 రోజుల కలెక్షన్స్.. తలైవా నుంచి మరో ఇండస్ట్రీ హిట్ !
Updated : Aug 28, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'జైలర్'.. మూడో వీకెండ్ లోనూ జోరు చూపించింది. శని, ఆది వారాల్లో ఈ సినిమా పలు చోట్ల వసూళ్ళ వర్షం కురిపించింది. దీంతో 'జైలర్' గ్రాస్ రూ. 571 కోట్లకు చేరుకుంది. ఇక షేర్ లెక్కల్లో చూస్తే.. రూ. 279 కోట్లు ఆర్జించింది ఈ సెన్సేషనల్ మూవీ. అదే విధంగా.. లాభాల పరంగా చూస్తే రూ. 155.05 కోట్ల వరకు క్రెడిట్ అయినట్లే. ఓవరాల్ గా.. సూపర్ స్టార్ నుంచి తమిళ చిత్ర పరిశ్రమకి మరో ఇండస్ట్రీ హిట్ అందినట్లే అన్నది ట్రేడ్ టాక్.
'జైలర్' 18 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తమిళనాడు – రూ. 171.90 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు - రూ. 77.65 కోట్ల గ్రాస్ (తమిళ వెర్షన్ తో కలిపి)
కర్ణాటక- రూ. 66.15 కోట్ల గ్రాస్
కేరళ – రూ. 51.45కోట్ల గ్రాస్
రెస్టాఫ్ ఇండియా – రూ. 15.25 కోట్ల గ్రాస్
ఓవర్సీస్ – రూ. 188.60 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 18 రోజుల కలెక్షన్స్ – రూ. 571.00 కోట్ల గ్రాస్ (రూ. 279.05 కోట్ల షేర్)