English | Telugu
ఇప్పుడా లిస్ట్‌లో అను ఇమ్మాన్యుయేల్ కూడా చేరిపోయింది!
Updated : Aug 28, 2023
హీరోయిన్లకు కాస్టింగ్‌కౌచ్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఎంతో మంది హీరోయిన్లు దానివల్ల పడిన ఇబ్బందుల్ని, చేదు అనుభవాల్ని అందరికీ తెలిసేలా చెప్పారు. ఇప్పుడు ఆ వరసలో చేరింది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. తన కెరీర్ ప్రారంభంలో ఓ నిర్మాత తనకు హీరోయిన్‌గా ఇస్తానంటూ వచ్చి తనకు ఓ ప్రపోజల్ పెట్టాడని, అయితే దాన్ని ఎంతో చాకచక్యంగా తిప్పికొట్టానని చెబుతోంది. ఈ తరహా ఇబ్బందిని తన కుటుంబసభ్యులతో కలిసి ఎదుర్కొన్నానంటోంది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘జపాన్’లో నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో తనకు ఎదురైన ఘటన గురించి వివరించింది అను. ఇదే సందర్భంలో అల్లు శిరీష్, తను డేటింగ్‌లో వున్నట్టు వార్తలు వస్తున్నాయని, అందులో ఏమాత్రం నిజంలేదని ఖండిరచింది. పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి టాప్ హీరోలతో నటించిన అనుకు తెలుగులో ప్రస్తుతం సినిమాలు లేవు.