ఫ్రస్ట్రేషన్ లో విజయ్ దేవరకొండ.. చూస్తుండిపోయిన సమంత.. !
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'ఖుషి'. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. 'నిన్ను కోరి', 'మజిలీ' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల కాగా.. అన్ని కూడా సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి.