బాలయ్య, నాగ్, వెంకీ.. 'యాక్షన్' ఫెస్టివల్స్!
ఆరు పదులు దాటినా.. యువ కథానాయకులకు పోటీగా సినిమాలు చేస్తున్నారు నిన్నటి తరం అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్. నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో సందడి చేసిన చిరు.. ప్రస్తుతం చిన్న బ్రేక్ లో ఉన్నారు. బాలయ్య, నాగ్, వెంకీ మాత్రం తక్కువ గ్యాప్ లోనే ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు.