English | Telugu

‘అర్జున్ రెడ్డి’ కాంబోపై కన్నేసిన నిర్మాతలు!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా సాధించిన సంచ‌ల‌న విజ‌యాన్ని ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స్టార్ హీరోగా నిల‌బెట్టిన స‌ద‌రు సినిమాతో సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తాను చాటారు. అదే సినిమాను ఆయ‌నే బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారు. ఈ మూవీ త‌ర్వాత మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ వంగా క‌లిసి ప‌ని చేయ‌లేదు. అయితే ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తే ఎలా ఉంటుందా? అని అభిమానులు, ప్రేక్ష‌కులు, సినీ సర్కిల్స్ అనుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో దీనికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట వైరల్ అవుతోంది.

‘ఖుషి’ రన్ టైమ్ రిస్క్‌.. డైరెక్ట‌ర్ కామెంట్స్‌

యూత్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘ఖుషి’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ అవుతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత హీరోయిన్‌గా అల‌రించ‌నుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య వ‌చ్చే మ‌న‌స్ప‌ర్ద‌లు ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది రూపొందింది.  ట్రైల‌ర్ చూస్తుంటే డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ఈ సినిమాతో ఏం చెప్పాల‌నుకుంటున్నార‌నేది క్లియ‌ర్‌గా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీకి సంబంధించిన విష‌య‌మొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. అదే ర‌న్ టైమ్‌.

‘టైగర్ నాగేశ్వరరావు’కి ఏపీ హైకోర్టు షాక్!

మాస్ మహారాజా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌లైంది. మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. అయితే అదే ఇప్పుడు చిత్ర యూనిట్‌కు స‌మ‌స్య‌గా మారింది. ఈ టీజ‌ర్‌లో ఉప‌యోగించిన భాష ఓ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా ఉందంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ధీర‌జ్ సింగ్ ఠాకూర్‌, న్యాయ‌మూర్తి ఆకుల వెంక‌ట శేషషాయి ధ‌ర్మాస‌నం టీజ‌ర్‌పై అభ్యంతరాన్ని తెలియ‌జేసింది. సెన్సార్ అనుమ‌తి లేకుండా టీజ‌ర్ ఎలా విడుద‌ల చేశార‌ని ప్ర‌శ్నిస్తూ చిత్ర నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్‌కు కోర్టు నోటీసుల‌ను జారీ చేసింది.