English | Telugu

'బెదురులంక 2012' 3 రోజుల కలెక్షన్స్.. రోజు రోజుకి పెరుగుడే!



'ఆర్ ఎక్స్ 100' (2018) తరువాత సరైన విజయం కోసం చకోర పక్షిలా వేచి చూస్తున్న హీరో కార్తికేయకి.. ఎట్టకేలకు అలాంటి హిట్ బొమ్మ పడినట్టే కనిపిస్తోంది. తాజా చిత్రం 'బెదురులంక 2012'కి వస్తున్న వసూళ్ళే ఇందుకు నిదర్శనం. ఫస్ట్ డే కంటే సెకండ్ డే కలెక్షన్స్ మెరుగ్గా ఉండడం.. ఇక మూడో రోజు వసూళ్ళు వాటికంటే బెటర్ గా ఉండడం చూస్తే.. రూ. 4. 50 కోట్ల షేర్టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'బెదురులంక' బ్రేక్ ఈవెన్ మార్క్చేరుకోవడం ఈజీ టాస్క్ అనే అనిపిస్తోంది.

'బెదురులంక 2012' 3 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 1.62 కోట్ల గ్రాస్
సీడెడ్ : రూ. 79 లక్షల గ్రాస్
ఉత్తరాంధ్ర: రూ. 64 లక్షల గ్రాస్
ఈస్ట్ గోదావరి : రూ. 47 లక్షల గ్రాస్
వెస్ట్ గోదావరి : రూ.24 లక్షల గ్రాస్
గుంటూరు: రూ. 44 లక్షల గ్రాస్
కృష్ణ : రూ. 38 లక్షల గ్రాస్
నెల్లూరు: రూ. 23 లక్షల గ్రాస్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ. 4.81 కోట్ల గ్రాస్ (రూ.2.93 కోట్ల షేర్)
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్: రూ. 1.53 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల కలెక్షన్స్ : రూ. 6.34 కోట్ల గ్రాస్ (రూ.3.68 కోట్ల షేర్)