English | Telugu

ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సాయితేజ్‌ని ఏ రేంజ్‌కి తీసుకెళ్తుందో!

‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత సాయితేజ్‌ చేసిన ‘బ్రో’ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా చేయబోయే సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ అందుతున్నాయి. ఈసారి పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌ చేసేందుకు సిద్ధమయ్యారు సాయితేజ్‌. ఈ సినిమాకి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ‘గాంజా శంకర్‌’ పేరుతో రూపొందే ఈ సినిమాలో సాయితేజ్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌. మరో హీరోయిన్‌ ఎంపిక జరగాల్సి ఉంది. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. సంపత్‌ నంది డైరెక్ట్‌ చేసిన ‘పేపర్‌ బోయ్‌’, ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాలకు హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చిన భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతాన్నందిస్తున్నారు. సెప్టెంబర్‌ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే సాయితేజ్‌ మాత్రం అక్టోబర్‌, నవంబర్‌లలో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. అప్పటివరకు సాయితేజ్‌ లేని సన్నివేశాలు చిత్రీకరించేందుకు సంపత్‌ నంది ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌తో సాయితేజ్‌ మరో సూపర్‌హిట్‌ కొట్టాలని ఆశిస్తున్నారు. సమ్మర్‌ స్పెషల్‌గా ‘గాంజా శంకర్‌’ను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.