English | Telugu
'అల్లుడు' టైటిల్స్ తో సుమన్ చేసిన సినిమాలివే.. వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఉందా?!
Updated : Aug 28, 2023
దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా వెండితెరపై వెలుగులు పంచుతున్నారు సుమన్. ఈ ప్రయాణంలో పలు విభిన్న పాత్రల్లో సందడి చేశారీ అందాల నటుడు. కథానాయకుడిగానే కాకుండా సహాయ నటుడిగానూ, ప్రతినాయకుడిగానూ తనదైన ముద్రవేశారు. 80ల్లో, 90ల్లో అయితే.. స్టార్ హీరోగా ఓ రేంజ్ చూశారాయన.
ఇక సుమన్ పేరు చెప్పగానే.. చాలామందికి ఆయన 'అల్లుడు' టైటిల్స్ తో సందడి చేసిన సినిమాలు ఠక్కున గుర్తుకువస్తాయి. ఎందుకంటే.. ఒక టైమ్ లో ఆ తరహా టైటిల్స్ తో వరుసగా సినిమాలు చేసి మెప్పించారీ హ్యాండ్సమ్ హీరో. 'అమెరికా అల్లుడు', 'పెద్దింటల్లుడు', 'కలెక్టర్ గారి అల్లుడు', 'దొంగల్లుడు', 'చిన్నల్లుడు', 'అల్లుడి పోరు అమ్మాయి జోరు', 'హలో అల్లుడు'.. అంటూ ఏడు సార్లుఅల్లుడుగాఎంటర్టైన్ చేశారు సుమన్. వీటిలో 'అమెరికా అల్లుడు', 'అల్లుడి పోరు అమ్మాయి జోరు' మినహా మిగతా చిత్రాలన్నింటికీ శరత్ నే దర్శకత్వం వహించడం విశేషం. ఈ అల్లుడు టైటిల్ మూవీస్ లో సక్సెస్ రేట్ కూడా ఎక్కవనే చెప్పాలి. అన్నట్టు.. సహాయ నటుడిగానూ ఆయన అల్లుడు టైటిల్ ఉన్న మూవీలో కనిపించారు. అదే.. 'నా అల్లుడు'. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో. అతనికి మేనమామగా సుమన్ దర్శనమిచ్చారు.ఏదేమైనా.. 'అల్లుడు' టైటిల్ మూవీస్ లో సుమన్ వేసిన ముద్ర ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి.
(ఆగస్టు 28.. సుమన్ బర్త్ డే సందర్భంగా)