English | Telugu
ఒక్క ఫోటోకి ఇన్ని కామెంట్లా.. అసలేం జరుగుతోందక్కడ?
Updated : Aug 28, 2023
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌కి ఇటీవల నందమూరి మోక్షజ్ఞ వచ్చారు. హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడితో ముచ్చటిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్‌లో ఈ ఫోటోను చూస్తున్నారు. మోక్షజ్ఞ, శ్రీలీల కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ చేస్తే బాగుంటుందని కొందరు, మోక్షజ్ఞ ముందు అనిల్ రావిపూడి అలా చేతులు కట్టుకొని నిలబడడం ఏమిటని కొందరు, మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ కోసం ఇంకెంత కాలం వెయిట్ చెయ్యాలని కొందరు... ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
మోక్షజ్ఞ హీరోగా రావాలని నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. దానికోసం చాలా ప్రయత్నాలు జరిగాయని, ఏదీ వర్కవుట్ అవ్వలేదని ఆమధ్య కొన్ని రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత ఆదిత్య 999 చిత్రంతో మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు. అయితే అది కూడా జరగలేదు. దానికితోడు మోక్షజ్ఞ ఫిట్‌నెస్‌పై అభిమానులు ఎంతో డిజప్పాయింట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు వర్కవుట్ చేస్తున్నాడా? అభిమానుల కోరికను మోక్షజ్ఞ ఎప్పుడు తీరుస్తాడు?