బరిలో 5 సినిమాలు.. ఈ సారి సంక్రాంతి మాములుగా ఉండదన్నమాట!
సంక్రాంతి సీజన్ లో రిలీజయ్యే సినిమాల సందడే వేరు. పోటీ మీద వచ్చే సినిమాల్లో కంటెంట్ ఏ మాత్రం బాగున్నా.. రిజల్ట్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది కూడా. 2006 సంవత్సరంలో అయితే 'లక్ష్మి', 'దేవదాసు', 'స్టైల్' ఇలా మూడు సంక్రాంతి హిట్స్ చూసిన వైనం ఉంది. అలాగే, 2017లోనూ 'ఖైదీ నంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'శతమానం భవతి' వంటి 3 సక్సెస్ ఫుల్ మూవీస్ ని సైతం చూశాం. సో.. సంక్రాంతి సీజన్ కి సరైన సినిమాలు పడితే సక్సెస్ పక్కా అన్నది చరిత్ర చెబుతున్న మాట.