English | Telugu
'గాండీవధారి అర్జున' 3 రోజుల కలెక్షన్స్.. మాములు డిజాస్టర్ కాదుగా!
Updated : Aug 28, 2023
మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాలన్నీ వరుస డిజాస్టర్స్ అవుతున్నాయి ఈ మధ్య. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' భారీ నష్టం చూస్తే.. నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'ది అంతకంటే ఘోరమైన పరిస్థితి. ఈ వరుసలోనే తాజాగా 'గాండీవధారి అర్జున' కూడా చేరింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్ళ పరంగానూ నిరాశపరుస్తోంది.
ఫస్ట్ డే కేవలం రూ. 1 కోటి షేర్ తెచ్చుకున్న ఈ మూవీ.. శని, ఆదివారాల్లో కలుపుకుని అందులో సగం కూడా తెచ్చుకోలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే ఆదివారం రోజున నామ మాత్రపు వసూళ్ళు కూడా రాబట్టలేకపోతోంది. దీంతో.. రూ. 18 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'గాండీవధారి అర్జున'.. ఫస్ట్ వీకెండ్ లో కనీసం 10 శాతం రికవరీ కూడా లేక డిజాస్టర్ బాట పట్టిందంటున్నారు ట్రేడ్ పండితులు.
'గాండీవధారి అర్జున' 3 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 96 లక్షల గ్రాస్
సీడెడ్ : రూ. 27 లక్షల గ్రాస్
ఆంధ్రా: రూ. 95 లక్షల గ్రాస్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ. 2.18 కోట్ల గ్రాస్ (రూ. 1.10 కోట్ల షేర్)
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్: రూ. 84 లక్షల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ : రూ. 3.02 కోట్ల గ్రాస్ (రూ.1.46 కోట్ల షేర్)