English | Telugu
రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న మరో క్లాసిక్ మూవీ!
Updated : Aug 28, 2023
ఈమధ్యకాలంలో పాత సినిమాలను రీరిలీజ్ చెయ్యడం అనే సంప్రదాయం మొదలైంది. ఇటీవలికాలంలో చాలా సినిమాలు రీరిలీజ్‌లోనూ రికార్డులు సృష్టించాయి. ఇప్పుడా వరసలో మరో క్లాసిక్ మూవీ వచ్చి చేరింది. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా మారి ‘నువ్వే కావాలి’ వంటి చక్కని ప్రేమకథతో లవర్‌బోయ్‌గా ఇమేజ్ సంపాదించుకున్న హీరో తరుణ్. రిచా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు, స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘నువ్వే కావాలి’ చిత్రానికి కథ, మాటలు అందించారు. కోటి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఈ సినిమా ఘనవిజయంలో కోటి సంగీతం కీలక పాత్ర పోషించింది. కోటిన్నర బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 20 కోట్లు కలెక్ట్ చేసి అప్పట్లో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. తర్వాత ఈ తరహా సినిమాలు రావడానికి ‘నువ్వే కావాలి’ స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడీ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో రీరిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకొని మరోసారి సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.