English | Telugu
అనసూయకు భలే షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
Updated : Aug 28, 2023
‘అర్జున్‌రెడ్డి’ రిలీజ్ అయినప్పటి నుంచి విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిశ్శబ్ద యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సందర్భం ఉన్నా, లేకున్నా విజయ్‌పై సోషల్ మీడియాలో అనసూయ ఏదో ఒక కామెంట్ పెట్టడం, దానిపై విజయ్ స్పందించకున్నా అతని ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేయడం, ఆమెపై రకరకాల కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అంటే విజయ్‌కి ఎలాంటి అభిప్రాయం ఉంది? అసలు ఆమెను లెక్కలోకి తీసుకుంటున్నాడా? అనే విషయం ఇటీవల తేటతెల్లమైంది.
సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ఖుషి’ విడుదలవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సుమ, రాజీవ్ కనకాల ‘ఖుషి’ టీమ్‌ని ఇంటర్వ్యూ చేశారు. విజయ్‌కి ఇష్టమైన యాంకర్ ఎవరై ఉంటారు అనే ప్రశ్నను హీరోయిన్ సమంతను అడిగారు. దానికామె కరణ్ జోహర్ అయి ఉండొచ్చు అని సమాధానమిచ్చింది. కానీ, విజయ్ మాత్రం తనకు ఇష్టమైన యాంకర్ సుమ అని చెప్పాడు. అంతటితో ఆగకుండా మీరు కాకుండా మరో యాంకర్ ఎవరైనా ఉన్నారా? అని సుమను ప్రశ్నించాడు. ఈ కామెంట్ అనసూయను దృష్టిలో పెట్టుకొనే అన్నాడని నెటిజన్లు భావిస్తున్నారు. ఎప్పటి నుంచో తనపై కామెంట్ చేస్తూ వస్తున్న అనసూయపై ఈవిధంగా రివెంజ్ తీర్చుకున్నాడని చెప్పుకుంటున్నారు.