English | Telugu
పవన్ బర్త్ డేకి 'ఓజీ' ఫస్ట్ లుక్ కాదు.. అంతకుమించి
Updated : Aug 28, 2023
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీపై పవన్ అభిమానుల్లో మాత్రమే కాకుండా యాక్షన్ ప్రియుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. పవర్ స్టార్ అసలుసిసలు బాక్సాఫీస్ స్టామినాని తెలిపే సినిమా ఇదవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లు, సెట్స్ లో పవన్ ఫోటోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి అదిరిపోయే ట్రీట్ రాబోతుంది.
సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ ఫస్ట్ లుక్ విడుదలవుతుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆరోజు ఫస్ట్ లుక్ కాదు, అంతకుమించి ఉండబోతుందని మేకర్ సర్ ప్రైజ్ చేశారు. "No first look.. hungry cheetah on sep 2nd" అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. గన్ పట్టుకొని ఉన్న హ్యాండ్ తో రూపొందించిన పోస్టర్ పవన్ ఫుల్ గా ఉంది. No first look అంటూ ఇచ్చిన అప్డేట్ ని బట్టి చూస్తే.. గ్లింప్స్ విడుదల చేయబోతున్నారని అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గ్లింప్స్ విడుదల అనేది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.