English | Telugu

'గుంటూరు కారం' ట్రీట్ డేట్ ఫిక్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి రెడీ అవుతున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు సినిమా వాయిదా పడుతుందా? అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలను మహేష్ కొట్టి పడేశారు. అనుకున్నట్లుగానే 'గుంటూరు కారం' సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తామని కన్ ఫర్మ్ చేసి రూమర్స్ కి చెక్ పెట్టారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమా నుంచి పాటను మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న విడుదల చేస్తారని అభిమానులు, ప్రేక్షకులు భావించారు. కానీ సాంగ్ రిలీజ్ కాలేదు. దీంతో వారు నిరాశకు లోనయ్యారు. కానీ ఇప్పుడు మేకర్స్ వినాయక చవితి సందర్భంగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వటానికి రెడీ అవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమచారం. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను కూడా నిర్మాతలు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు.

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో కథానాయికలు. మరో 80 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ నాటికంతా మేజర్ షూటింగ్ ను పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.