English | Telugu

సమ్మర్ లో నితిన్ సినిమా.. 'దేవర'కి పోటీనా?


యూత్ స్టార్ నితిన్.. హిట్ చూసి చాలాకాలమే అయింది. భీష్మ తరువాత వచ్చిన చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నాడు నితిన్. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చేస్తున్న నితిన్.. ఆపై వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అలాగే వేణు శ్రీరామ్ నిర్దేశకత్వంలో తమ్ముడు అనే మూవీని ఇటీవలే ప్రారంభించాడు. వీటిలో ఎక్స్ ట్రా క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23నరిలీజ్ కాబోతుండగా.. వెంకీ కుడుముల సినిమా రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తమ్ముడు విషయానికి వస్తే.. నితిన్ 'దిల్' రిలీజైన ఏప్రిల్ 4న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అదే గనుక నిజమైతే.. ఏప్రిల్ 5న వస్తున్నయంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ 'దేవర'కి పోటీగా 'తమ్ముడు' రాబోతున్నట్లే. మరి.. దేవర వర్సెస్ తమ్ముడు అన్నట్లుగా ఉండబోతున్న ఈ బాక్సాఫీస్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. త్వరలోనే తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.