English | Telugu
సోమవారం పరీక్షలో పాసైన 'బెదురులంక'.. 4 రోజుల కలెక్షన్స్ ఇవే!
Updated : Aug 29, 2023
వీకెండ్ లో మంచి ఓపెనింగ్స్ రాబట్టిన పెద్ద పెద్ద సినిమాలే.. సోమవారం పరీక్షలో ఘోరంగా దెబ్బతింటుంటాయి. అలాంటిది వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఓ యంగ్ హీరోకి.. యావరేజ్ కంటెంట్ తో వచ్చిన సినిమా 'మండే టెస్ట్' లోనూ పాసై మంచి వసూళ్ళు అందించింది. ఆ యువ కథానాయకుడు.. 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ కాగా, ఆ చిత్రం 'బెదురులంక 2012'. తొలి వారాంతంలో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ వచ్చిన ఈ సినిమా.. సోమవారం కాస్త తగ్గినా స్టడీగానే సాగింది. అంతేకాదు.. రూ. 4. 50 కోట్ల షేర్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'బెదురులంక'.. బ్రేక్ ఈవెన్ మార్క్ కి అతి చేరువగా రావడం ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది.
'బెదురులంక 2012' 4 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 1.99 కోట్ల గ్రాస్
సీడెడ్ : రూ. 93 లక్షల గ్రాస్
ఉత్తరాంధ్ర: రూ. 83 లక్షల గ్రాస్
ఈస్ట్ గోదావరి : రూ. 60 లక్షల గ్రాస్
వెస్ట్ గోదావరి : రూ.31 లక్షల గ్రాస్
గుంటూరు: రూ. 55 లక్షల గ్రాస్
కృష్ణ : రూ. 47 లక్షల గ్రాస్
నెల్లూరు: రూ. 27 లక్షల గ్రాస్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ. 5.95 కోట్ల గ్రాస్ (రూ.3.59 కోట్ల షేర్)
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్: రూ. 1.71 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల కలెక్షన్స్ : రూ. 7.66 కోట్ల గ్రాస్ (రూ.4.43 కోట్ల షేర్)