English | Telugu

‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ డేట్ మారుతుందా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మాత‌గా వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. నుపూర్ స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల‌కే ప‌రిమిత‌మైన ఈ రవితేజ తొలిసారి పాన్ ఇండియా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను అక్టోబ‌ర్ 20న విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ మూవీ రిలీజ్ డేట్ మారనుంది. అంటే మూవీ రిలీజ్ వెన‌క్కి వెళ్ల‌టం లేదు. ప్రీ పోన్ అవుతుంద‌ని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ప్రభాస్ కి పోటీగా ఎన్టీఆర్ బావమరిది!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సలార్'. మొదటి భాగం సీజ్‌ ఫైర్‌ సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించగల సినిమా 'సలార్' అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు కూడా బలంగా నమ్ముతున్నాయి. అందుకే ఈ సినిమా విడుదల సమయంలో ఇతర సినిమాలు విడుదల చేయాలంటే కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మాత్రం తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు.