English | Telugu
బాలయ్య, నాగ్, వెంకీ.. 'యాక్షన్' ఫెస్టివల్స్!
Updated : Aug 29, 2023
ఆరు పదులు దాటినా.. యువ కథానాయకులకు పోటీగా సినిమాలు చేస్తున్నారు నిన్నటి తరం అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్. నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో సందడి చేసిన చిరు.. ప్రస్తుతం చిన్న బ్రేక్ లో ఉన్నారు. బాలయ్య, నాగ్, వెంకీ మాత్రం తక్కువ గ్యాప్ లోనే ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. విశేషమేమిటంటే.. ఈ ముగ్గురు కూడా తదుపరి సినిమాల్లో యాక్షన్ ని నమ్ముకున్నారు. అంతేకాదు.. ఆయా చిత్రాలు ఫెస్టివల్ సీజన్స్ లోనే పలకరించబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. అఖండ, వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత బాలయ్య నుంచి రాబోతున్న సినిమా భగవంత్ కేసరి. ఇందులో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించబోతున్నారు నటసింహం. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక వెంకటేశ్ విషయానికి వస్తే సైంధవ్ గా సందడి చేయబోతున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ మూవీ కోసం స్వల్ప విరామం అనంతరం యాక్షన్ బాట పట్టారు వెంకీ. అలాగే, నాగ్ కూడా నా సామి రంగ అంటూ సంక్రాంతికి ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇందులో మాస్ జాతర చేయడానికి యాక్షన్ మార్గంలో వెళుతున్నారు కింగ్. మరి.. ఫెస్టివల్ సీజన్స్ లో యాక్షన్ మూవీస్ తో ఎంటర్టైన్ చేయనున్న ఈ 60 ప్లస్ స్టార్స్.. ఏ స్థాయి విజయాలను అందుకుంటారో చూడాలి.