English | Telugu
తను పనిచేసిన బస్ డిపోలో సూపర్‌స్టార్! షాక్ అయిన సిబ్బంది!
Updated : Aug 29, 2023
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినీరంగంలోకి ఎలా వచ్చారో, సూపర్‌స్టార్‌గా ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందే. బెంగుళూరులో సిటీబస్ కండక్టర్‌గా పనిచేసి సినిమాల మీద మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి అవకాశాల కోసం ప్రయత్నించారు. మొదట చిన్న చిన్న పాత్రలు చేసి, ఆ తర్వాత విలన్‌గా కూడా నటించి తనలోని టాలెంట్‌ని అందరూ గుర్తించేలా చేసుకున్నారు. తను ఎంత ఎత్తుకు ఎదిగినా తన గతాన్ని మరచిపోని రజనీ ఇటీవల తను పనిచేసిన బెంగుళూరులోని బస్ డిపోకి వెళ్లారు. ఎలాంటి సమాచారం లేకుండా సడన్‌గా వచ్చిన రజనీని చూసి అక్కడి స్టాఫ్ ఆశ్చర్యపోయారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు ముచ్చటపడ్డారు. దానికి రజనీ కూడా ఎంతో ఓపికగా అందరికీ సెల్ఫీలు తీసుకునే అవకాశం ఇచ్చారు. అక్కడి సిబ్బందితో చాలా సేపు మాట్లాడి తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇప్పటి జనరేషన్‌లో చిన్న స్థాయి నుంచి హీరోగా పెద్ద స్థాయికి ఎదిగిన వారిలో కొందరు రిజర్వ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. పాత రోజుల్ని మరచిపోయినట్టు బిహేవ్ చేస్తుంటారు. కానీ, రజనీ మాత్రం అలా కాదు. తను సూపర్‌స్టార్‌ని అనే గర్వం ఇసుమంత కూడా ఉండదు. ఎంతో సింపుల్‌గా జీవిస్తారు. అతనిలో అందరికీ నచ్చే గుణం అదే. అందుకే ప్రపంచవ్యాప్తంగా రజనీకి ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది.