English | Telugu
ధనుష్ సినిమాలో నాగ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా
Updated : Aug 29, 2023
బర్త్ డే సందర్భంగా అక్కినేని అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు కింగ్ నాగార్జున. పొద్దుపొద్దునే 'నా సామి రంగ' అంటూ మాంచి మాస్ ట్రీట్ ఇచ్చి మరీ కొత్త సినిమా కబురు పంచుకున్నారాయన. అక్కడితో సరిపెట్టుకోకుండా.. మరో క్రేజీ న్యూస్ వినిపించేశారు. అతి త్వరలో ఓ పాన్ ఇండియా మూవీలో నాగ్ సందడి చేయనున్నారన్నదే ఆ న్యూస్ సారాంశం.
ఆ వివరాల్లోకి వెళితే.. తమిళ కథానాయకుడు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తుండగా.. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్ట్ లో నాగ్ కూడా కనిపించనున్నారని ఆ మధ్య కథనాలు వచ్చాయి. అవి నిజమని నిరూపిస్తూ.. చిత్ర నిర్మాణ సంస్థ నాగ్ ఎంట్రీపై అధికారిక ప్రకటన ఇచ్చేసింది. ధనుష్, శేఖర్ కమ్ములతో తీస్తున్న పాన్ ఇండియా మూవీకి ఓ పవర్ హౌస్ అవసరమైందని.. కింగ్ కంటే ఇంకెవరు బెటర్ గా ఉంటారంటూ నాగ్ కి బర్త్డ్ డే విషెస్ తెలిపి మరీ అనౌన్స్ ఇచ్చేశారు. మరి.. నాగ్, ధనుష్, శేఖర్ కమ్ముల, రష్మికా మందన్న క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియా వెంచర్.. ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.