English | Telugu
‘మార్క్ ఆంటోని’ ఈ సంవత్సరం తన బర్త్‌డే స్పెషల్ అంటున్న హీరో!
Updated : Aug 29, 2023
ఈ సంవత్సరం తన బర్త్‌డే ఎంతో స్పెషల్ అనీ, తను హీరోగా నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతోందని, ఆడియన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ నిస్తుందని హీరో విశాల్ అంటున్నారు. ఆగస్టు 29 హీరో విశాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను హీరోగా నటించిన‘మార్క్ ఆంటోని’ చిత్రంలోని విశేషాలు తెలిపారు.ఇప్పటిరకు తను ఎన్నో రకాల క్యారెక్టర్స్ చేశానని, ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇది అని విశాల్ చెబుతున్నారు. హీరో విశాల్ఈ సినిమాలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ చేశారు. రెండిరటికి సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని విశాల్ అంటున్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ ఎస్.జె.సూర్య ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. జి.వి.ప్రకాష్ మ్యూజిక్, అభినందన్ రామానుజం ఫోటోగ్రఫీ, పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణన్ ఫైట్స్ ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్స్‌గా నిలుస్తాయని హీరో విశాల్ చెప్పారు.