English | Telugu
నాగ్ పై దర్శకుడి విలనిజం
Updated : Aug 29, 2023
కింగ్ నాగార్జునపై విలనిజం చూపించే పనిలో ఉన్నాడట డైరెక్టర్. అందుకే.. నాగ్ మనుషులను టార్గెట్ చేసుకుని హింసామార్గంలో పయనిస్తున్నాడట. ఇంతకీ ఎవరా డైరెక్టర్? ఏమా కథ?
ఆ వివరాల్లోకి వెళితే.. నాగార్జున కథానాయకుడిగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో 'నా సామి రంగ' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నాగ్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు (ఆగస్టు 29) ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు కూడా. కాగా, ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ ఉందట. ఆ పాత్రలో పలాస దర్శకుడు కరుణ కుమార్ కనిపించబోతున్నారట. తెలుగు తెరపై ఇప్పటివరకు చూపని విలనిజం.. ఈ పాత్రలో ఆవిష్కరిస్తున్నారట మేకర్స్. మరి.. పలాస దర్శకుడి విలనిజం నా సామి రంగకి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న నా సామి రంగ.. 2024 సంక్రాంతికి థియేటర్స్ లో రానుంది. బంగార్రాజు తరువాత సంక్రాంతికి వస్తున్న నాగ్ సినిమా ఇదే కావడం విశేషం.