English | Telugu
అమ్మబాబోయ్.. పబ్లిక్ గా హీరోయిన్ కి ముద్దు పెట్టిన డైరెక్టర్!
Updated : Aug 29, 2023
కొందరు తెలిసో తెలియకో చేసే పనులు వారికి, వారి సినిమాకి బోలెడంత పబ్లిసిటీ తెచ్చిపెడతాయి. తాజాగా దర్శకుడు ఏఎస్ రవికుమార్ చేసిన ఓ పని ఆయన సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెడుతోంది.
రాజ్ తరుణ్ హీరోగా ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'తిరగడబారా సామి'. ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మీడియా ఎదుట హీరోయిన్ మన్నారా చోప్రాతో డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. మొదట మన్నారా భుజంపై చేతులు వేసి, ఫొటోకి ఫోజులిచ్చిన రవికుమార్.. ఆ తర్వాత ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. రవికుమార్ చర్యతో ఒక్కసారిగా షాకైన మన్నారా.. ఆ వెంటనే తేరుకొని స్మైల్ ఇచ్చింది. మన్నారాతో రవికుమార్ చనువుగా ఉంటూ ముద్దు పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.