English | Telugu
మానసిక వేదనకు గురవుతున్నాను... అమల వీడియో వైరల్!
Updated : Aug 30, 2023
తమిళ చిత్రం ‘మైనా’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ ఆ తర్వాత రామ్‌చరణ్ ‘నాయక్’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమై ఓ అరడజను సినిమాలు చేసింది. అయితే ఆమె తెలుగులో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ రాలేదు. ఆ తర్వాత 2014లో డైరెక్టర్ విజయ్‌ని పెళ్లి చేసుకుంది. కొన్ని కారణాల వల్ల మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకుంది. తెలుగులో అంతగా రాణించలేకపోయిన అమల తమిళ్‌లో మంచి సినిమాలే చేసింది. అయితే తాను చాలా విషయాల్లో ఎంతో మోసపోయానంటూ తన బాధను వ్యక్తం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది అమల. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. కరోనా సమయంలో ఖాళీగా ఉండడం వల్ల ఒంటరితనాన్ని ఫీల్ అయ్యానని, ఎంతో బాధపడేదాన్నని అమల చెబుతోంది. ఆ సమయంలో తన తల్లి ఎంతో ధైర్యం చెప్పేదని అంటోంది. తను ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని, ఆ విషయంలో ఎంతో మానసిక వేదనకు గురవుతున్నానని చెబుతోంది అమల.