English | Telugu

రజినీకాంత్ పై భారీ కుట్ర.. ఆ పని చేసినోడ్ని వదిలిపెట్టకూడదు!


సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరే ఒక బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులున్న లెజండరీ యాక్టర్ గా తలైవాకి ప్రత్యేక ఇమేజ్ ఉంది. అలాంటి స్టార్ పైనే భారీ కుట్ర జరిగిందిప్పుడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇంతకీ ఏం జరిగిందంటే..

రజినీకాంత్ కొత్త సినిమా 'జైలర్' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. దాదాపు రూ. 600 కోట్ల గ్రాస్ ఆర్జించిన ఈ సినిమా.. తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. రిలీజై 20 రోజులు దాటినా ఇప్పటికీ వసూళ్ళ జోరు తగ్గడం లేదు. ఇంకా మరికొద్ది రోజులు జైలర్ హవాకి తిరుగుండదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్న సమయంలో.. అనూహ్యంగా మంగళవారం (ఆగస్టు 29) నుండి హెచ్.డి. ప్రింట్ పలు పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది.

ఏకంగా 10 జీబీ సైజుతో, స్పష్టమైన క్వాలిటీతో, డాల్బీ సౌండ్ తో ఈ హెచ్.డి. ప్రింట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఒరిజినల్ గా తమిళ్ వెర్షన్ లోనే ఈ ప్రింట్ వచ్చినా.. దాన్ని ఇతర భాషల సౌండ్ మిక్స్ చేసి మరీ వీక్షకులకు అందించే ప్రయత్నం జరిగింది. ఇదంతా రాత్రికి రాత్రే జరగడం ఫ్యాన్స్ కి షాక్ కి గురిచేస్తోంది. ఉద్దేశపూర్వకంగా జరిగిన భారీ కుట్ర ఇదని.. పైరసీ చేసిన వాడిని వదిలిపెట్టకూడదని తలైవా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ పైరసీ కారణంగా.. ఓటీటీ, శాటిలైట్ ప్రీమియర్లను గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న సన్ నెక్స్ట్ కి వ్యూస్, టీఆర్పీ పరంగా ప్రభావం చూపే అవకాశముందని కలవరపడుతున్నారు రజినీ ఫ్యాన్స్. అలాగే జపాన్, మలేసియా దేశాల్లోనూ రిలీజ్ కావాల్సిన జైలర్ కి.. కలెక్షన్ల పరంగా ఈ పైరసీ భూతం పెద్దగండి కొట్టినట్టేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. రజినీకాంత్ సినిమాపై జరిగిన ఈ భారీ హెచ్.డి. కుట్ర.. టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతోంది.



పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.