English | Telugu
వేటూరి రాసిందొకటి.. ఉదిత్ పాడింది మరొకటి.. అయినా పెద్ద హిట్!
Updated : Aug 30, 2023
వైజయంతి మూవీస్ అంటే టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ సంస్థ. చిరంజీవి కాంబినేషన్‌లో ఈ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అందులో చూడాలని వుంది ఒకటి. ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్ మూవీ. మ్యూజికల్‌గా కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. బోనీకపూర్ వల్ల ఈ సినిమాను హిందీలో నిర్మించాలని అశ్వనీదత్, అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అనిల్‌కపూర్‌కు, గుణశేఖర్‌కు సెట్ అవ్వక పోవడంతో సినిమా ఆగిపోయింది. దానివల్ల అల్లు అరవింద్, తను చెరో ఆరు కోట్లు నష్టపోయామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అశ్వనీదత్.
ఈ సినిమాలో ఎంతో పెద్ద హిట్ అయిన ‘రామ్మా.. చిలకమ్మా’ పాట వెనుక కూడా ఓ కథ ఉంది. వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఈ పాటను ఉదిత్ నారాయణ్, స్వర్ణలత ఆలపించారు. అయితే వేటూరి ‘రామా చిలకమ్మా..’ అని రాస్తే.. సింగర్ ఉదిత్ నారాయణ్ దాన్ని ‘రామ్మా చిలకమ్మా’గా పాడారు. సౌండిరగ్ బాగుండడంతో దాన్ని అలానే ఉంచేశారు. అదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు.