English | Telugu

అక్కినేని ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన మహేష్.. చనువా? పొగరా?...

అభిమానులు ఎలా ఉన్నా హీరోలు మాత్రం ఒకరితో ఒకరు మంచి అనుబంధాన్ని కొనసాగిస్తుంటారు. తెలుగులో పలువురు హీరోల మధ్య 'రా', 'బావ' అని పిలుచుకునే అంత చనువుంది. అయితే తాజాగా నాగార్జున అభిమానులు.. తమ హీరోని మహేష్ బాబు రెస్పెక్ట్ ఇవ్వకుండా పేరు పెట్టి సంభోదించినందుకు హర్ట్ అయ్యారు. కొందరైతే మహేష్ మీద ఫైర్ అవుతున్నారు కూడా.

ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా ఆయనకు ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. అయితే విష్ చేయడం వరకు ఓకే గానీ, 'హ్యాపీ బర్త్ డే నాగార్జున' అని ట్వీట్ చేయడమే చర్చకు దారితీసింది. తనకంటే సీనియర్ అయిన నాగార్జునకు గారు లేదా సార్ అని రెస్పెక్ట్ ఇవ్వకుండా.. పేరు పెట్టి పిలవడంపై విమర్శలు వస్తున్నాయి. సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా?, ఇదేమి సంస్కారం అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. విష్ చేసినందుకు సంతోషంగా ఉన్నా, ఇలా రెస్పెక్ట్ ఇవ్వకుండా విష్ చేయడం బాలేదంటూ కొందరు అక్కినేని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ ఇలా విష్ చేయడానికి కారణం నాగార్జునతో ఆయనకున్న చనువే అని చెప్పొచ్చు.

మహేష్ కంటే నాగ్ సీనియర్ అయినా, ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా.. వీరిద్దరూ స్నేహితుల్లాగే ఉంటారు. మహేష్ కి ముందు నుంచి నాగార్జునను పేరు పెట్టి పిలవడం లేదా నాగ్ అని పిలవడం అలవాటు. ఈ విషయాన్ని గతంలో పలు సందర్భాల్లో చెప్పారు నాగార్జున. అంతేకాదు నాగ్ సినిమా హిట్ అయితే మహేష్ నుంచి ఖచ్చితంగా ఫోన్ వెళ్తుందని, ఇద్దరూ ఎంతో సరదాగా మాట్లాడుకుంటారని అంటుంటారు. ఆ చనువుతోనే మహేష్ అలా విష్ చేశాడని, అంతేకాని అది రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కాదని సన్నిహిత వర్గాలు చెబుతున్నమాట.