English | Telugu
మహేష్‌బాబుకి పెద్ద మైనస్ అయింది... మరి వేణు విషయంలో..!
Updated : Aug 30, 2023
స్వయంవరం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణరాముడు, ఖుషిఖుషీగా, పెళ్లాం ఊరెళితే వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించాడు. అతను నటించిన చివరి సినిమా రామాచారి. 2012లో ఈ సినిమా రిలీజ్ అయింది. 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించాడు వేణు. ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్ చేస్తున్న వెబ్ సిరీస్ ‘అతిథి’లో కనిపించబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్న టీజర్ వెబ్ సిరీస్‌పై క్యూరియాసిటీని పెంచుతోంది. ఓ మిస్టీరియస్ సబ్జెక్ట్‌తో ఈ సిరీస్ రూపొందినట్టు తెలుస్తోంది. గతంలో సూపర్‌స్టార్ మహేష్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో ‘అతిథి’ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయి మహేష్‌కి పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు అదే పేరుతో వేణు చేస్తున్న వెబ్ సిరీస్ ఏమేరకు ఆకట్టుకుంటుందో, వేణుకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. సెప్టెంబర్ 19న డిస్నీ హాట్‌స్టార్‌లో ‘అతిథి’ వెబ్ సిరీస్ విడుదల కానుంది.