English | Telugu

ఇది సార్ బన్నీ రేంజ్.. అసలుసిసలు గ్లోబల్ స్టార్!

"వీడు హీరో ఏంట్రా నుంచి వీడురా హీరో అంటే'' అనే స్థాయికి ఎదిగిన హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి హీరోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మొదటి సినిమా 'గంగోత్రి' టైంలో లుక్స్ పరంగా ట్రోల్స్ ఎదుర్కొన్న బన్నీ.. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా ఎదిగి.. ఇప్పుడేకంగా పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నారు.

'పుష్ప: ది' రైజ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్. 'గంగోత్రి' నుండి 'పుష్ప' వరకు తనని తాను మెరుగుపరుచుకుంటూ.. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలోనూ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయనతో ఇన్‌స్టాగ్రామ్‌ ఓ స్పెషల్ వీడియో చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్పెషల్ వీడియో చేసిన తొలి ఇండియన్ మేల్ యాక్టర్ బన్నీనే. ఫస్ట్ టైం అమెరికా నుంచి ఇన్స్టాగ్రామ్ టీం స్వయంగా హైదరాబాద్ వచ్చి ఓ రోజంతా అల్లు అర్జున్ తో గడపడం విశేషం .

వీడియోలో బన్నీ దినచర్యను చూపించారు. ఉదయం లేచినప్పటి నుంచీ షూటింగ్ ముగిసే వరకూ తాను ఏయే పనులు చేస్తారో ఆ వీడియోలో వివరించారు. షూట్ కి వెళ్లే ముందు తన ఇంట్లో అర్జున్ ఓ టూర్ వేసి చూపించారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు తీసుకెళ్లడంతోపాటు అక్కడ మూవీ కోసం వేసిన సెట్స్, తన కాస్ట్యూమ్స్, మూవీ షూటింగ్ వంటి పలు విషయాలను వీడియోలో పంచుకున్నారు.

"పుష్ప 2 సెట్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ ఉదయాన్నే కాస్త చిల్ అవుతారు" అంటూ ఈ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేసింది. "ఇండియాలో అభిమానులు చాలా భిన్నం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది కనిపించదు. మీరు చూడాల్సిందే. దీనిని వర్ణించలేం" అంటూ చెప్పడం అల్లు అర్జున్ గ్లోబల్ లెవెల్ లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారు అర్థమవుతుంది. అభిమానులే తనకు మోటివేషన్ అని, వాళ్ల ప్రేమే తాను తన సరిహద్దులను చెరిపేస్తూ ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తోందని బన్నీ అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.