English | Telugu

'బెదురులంక' 5 రోజుల కలెక్షన్స్.. కార్తికేయ నువ్వు అదుర్స్ అంతే!


'ఆర్ ఎక్స్ 100'తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు కార్తికేయ. అయితే, ఆ తరువాత తను నటించిన సినిమాలన్నీ తుస్సుమన్నాయి. విలన్ గా ట్రై చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ సినిమా మళ్ళీ అతనికో హిట్ కట్టబెట్టింది. ఆ చిత్రమే.. 'బెదురులంక 2012'. గత శుక్రవారం (ఆగస్టు 25) విడుదలైన ఈ సినిమా.. మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ వసూళ్ళ పరంగా మెప్పిస్తోంది. తొలి రోజు నుండి ఐదో రోజు వరకు రూ. కోటికి తగ్గకుండా షేర్ ఆర్జిస్తోంది. అంతేకాదు.. మంగళవారం వచ్చిన కలెక్షన్స్ తో రూ. 4. 50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ ని సాధించడమే కాకుండా.. లాభాల్లోకీ అడుగుపెట్టేసింది. హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. మొత్తానికి.. 'బెదురులంక' ఫలితం చూసి కార్తికేయ అదుర్స్ అంటున్నారు ట్రేడ్ పండితులు.

'బెదురులంక 2012' 5 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 2.33 కోట్ల గ్రాస్
సీడెడ్ : రూ. 1.12 కోట్ల గ్రాస్
ఉత్తరాంధ్ర: రూ. 98 లక్షల గ్రాస్
ఈస్ట్ గోదావరి : రూ. 69 లక్షల గ్రాస్
వెస్ట్ గోదావరి : రూ.37 లక్షల గ్రాస్
గుంటూరు: రూ. 65 లక్షల గ్రాస్
కృష్ణ : రూ. 56 లక్షల గ్రాస్
నెల్లూరు: రూ. 32 లక్షల గ్రాస్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ. 7.02 కోట్ల గ్రాస్ (రూ.4.21 కోట్ల షేర్)
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్: రూ. 1.86 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల కలెక్షన్స్ : రూ. 8.88 కోట్ల గ్రాస్ (రూ.5.12 కోట్ల షేర్)

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.