English | Telugu

విశ్వ‌క్ సేన్‌కి బాల‌య్య స‌ర్‌ప్రైజ్‌!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్‌..నంద‌మూరి ఫ్యామిలీ హీరోల‌కు పెద్ద అభిమాని. మ‌రీ ముఖ్యంగా బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌లంటే విశ్వ‌క్ సేన్ త‌న అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంటారు. అలాగే నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌లు సైతం విశ్వక్ సేన్ సినిమాల‌కు త‌మ స‌పోర్ట్‌ను అందిస్తుంటారు. తాజాగా మ‌రోసారి వీరి మధ్య అనుబంధం బ‌య‌ట‌ప‌డింది. విశ్వ‌క్ సేన్‌కి నంద‌మూరి బాల‌కృష్ణ అనుకోని స‌ర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. ఇంత‌కీ ఆయ‌నేం చేశార‌నే వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా సెట్స్‌ను బాల‌య్య సంద‌ర్శించారు.

దళపతికి నో చెప్పిన జో.. ఇప్పుడు మరో మాజీ స్టార్ హీరోయిన్ తో

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ లియో సినిమాను పూర్తి చేసుకున్నారు. ఆ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న తెలుగు, తమిళ భాషల్లో భారీ విడుదలకు సన్నద్ధమవుతోంది. అయితే విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన 68వ సినిమాను స్టార్ట్ చేసేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ 68వ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినీ సర్కిల్స్ లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే మరో హీరోయిన్ గా ఎవరినీ తీసుకుంటారనే దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. విజయ్ తో జ్యోతిక జోడీ కడుతుందంటూ న్యూస్ రాగానే అది హాట్ టాపిక్ గా మారింది.