English | Telugu
'లైగర్' ఫ్లాప్ పై రౌడీ స్టార్ రియాక్షన్..!
Updated : Aug 30, 2023
అభిమానులను ముద్దుగా రౌడీస్ అని పిలుచుకునే స్టార్ హీరో విజయ్ దేవరకొండ సెప్టెంబర్ 1న 'ఖుషి' సినిమాతో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ తో రౌడీ స్టార్ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా 'లైగర్' సినిమా ఫ్లాప్ గురించి అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు. ''జయాపజయాలతో సంబంధం లేకుండా నేను ప్రతీ కథను అద్భుతమైనదిగా ఉండేలానే చూసుకుంటాను. కానీ అనుకున్నట్లు ప్లానింగ్ ప్రకారం సినిమాను తెరకెక్కించకపోవటం వల్ల నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఉదాహరణకు మనం ఫ్రెండ్స్ కు ఏదైనా జోక్ ను వివరించేటప్పుడు సరిగ్గా వివరించకపోతే అది సరిగ్గా పండదు. నా సినిమాలు లైగర్, డియర్ కామ్రేడ్, నోటా వంటి విషయాల్లో ఇదే జరిగింది. డిఫరెంట్, బిగ్ కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నా, కానీ కుదరలేదు. సినిమా సమయంలో బిజినెస్ పరంగానూ ఒత్తిడి ఉంటుంది. ఓ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే సొంత థియేటర్ ఉన్న వ్యక్తిగా దాని ప్రభావం ఎలా ఉంటుందనేది నాకు తెలుసు'' అన్నారు.
మహానటి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మజిలీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత నటించింది. సమంతకు నేనొక పెద్ద ఫ్యాన్ అని చెప్పిన విజయ్ దేరవకొండ.. ఆమెతో కలిసి నటించటం గ్రేట్ ఎక్స్ పీరియెన్స్ అని తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుందని పేర్కొన్నారు.