English | Telugu

షాకింగ్ న్యూస్‌: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ డైరెక్టర్ మార్పు!

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడి స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటించారు. ఈ సినిమాను నవంబర్ 24న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి నిర్ణయించుకున్నారు అభిషేక్ నామా. ఈ సినిమాకు ముందుగా నవీన్ మేడారంను దర్శకుడిగా అనౌన్స్ చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆయన పేరు కనిపించటం లేదు. రీసెంట్ ప్రెస్ నోట్ ప్రకారం చూస్తే నవీన్ మేడారం పేరు దర్శకుడిగా ఎక్కడా ప్రస్తావన కాలేదు. ఆయన స్థానంలో అభిషేక్ నామా పేరు కనిపించింది. అంటే డెవిల్ సినిమాకు నిర్మాతే దర్శకుడిగా మారారు. మరి ఇలా జరగటానికి దర్శకుడికి, నిర్మాతకు మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చుననేది వినిపిస్తోన్న టాక్.

లియో ఫ‌స్ట్ హాఫ్‌... హాట్ అప్‌డేట్స్ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌!

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన సినిమా లియో. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను సెవ‌న్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తోంది. అక్టోబ‌ర్ 19న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది లియో. సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఫ్యాన్స్ కి మెల్లిమెల్లిగా అప్‌డేట్స్ అందుతున్నాయి. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చేశారు నిర్మాత ల‌లిత్‌కుమార్‌. ఆయ‌న లియో ఫ‌స్ట్ హాఫ్ చూసేశార‌ట‌. ఆనందాన్ని ఆపుకోలేక ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. ఇటీవ‌ల విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న మ‌హారాజా సినిమా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చెన్నైలో జ‌రిగింది. ఈ వేదిక‌మీదే ల‌లిత్‌కుమార్ అప్‌డేట్స్ రివీల్ చేశారు. 

ఎక్స్ క్లూజివ్‌: స్పిరిట్ షురూ అయ్యేది అప్పుడే!

ప్ర‌భాస్ సినిమాల‌కు సంబంధించి రోజుకో న్యూస్ ఫ్యాన్స్ ని తిక‌మ‌క‌పెట్టేస్తోంది. రీసెంట్‌గా క‌న్న‌ప్ప సినిమాలో ప్ర‌భాస్ న‌టిస్తార‌నే వార్త ఇంట‌ర్నెట్‌ని షేక్ చేసింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించే సినిమా వార్త వేగంగా వైర‌ల్ అవుతోంది. క‌బీర్ సింగ్‌లాంటి హిస్టారిక‌ల్ స‌క్సెస్‌ని ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించ‌నున్న సినిమా స్పిరిట్‌. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి వంగా త‌న యానిమ‌ల్ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను భూష‌ణ్ కుమార్‌,  మురాద్ ఖేతాని నిర్మిస్తున్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్‌, ర‌ష్మిక మంద‌న్న కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ 1న విడుద‌ల కానుంది యానిమ‌ల్‌.