English | Telugu

రజినీకాంత్ 171 ప్రకటన వచ్చేసింది!

సూపర్ స్టార్ రజినీకాంత్ 171వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లే యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రజినీకాంత్‌తో జైలర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. దీంతో నెటిజన్స్ తలైవర్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకుంటే లోకేష్ కనకరాజ్ మాస్ హీరోయిజాన్ని నెక్ట్స్ రేంజ్‌లో ఎలివేట్ చేస్తారు. తను రజినీకాంత్ వంటి గాడ్ ఆఫ్ మాసెస్‌ను డైరెక్ట్ చేస్తే వచ్చే ఔట్ పుట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.