English | Telugu

‘ఇండియన్ 2’ రిలీజ్ విష‌యంలో క్లారిటీ

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఇప్పుడు రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేస్తున్న సంగ‌తి అందరికీ తెలిసిందే. ఓ వైపు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో గేమ్ చేంజ‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మ‌రో వైపు యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌తో ఇండియ‌న్ ను రూపొందిస్తున్నారు. నెల‌లో కొన్ని రోజులు చ‌ర‌ణ్ సినిమాకు, కొన్ని రోజులు క‌మ‌ల్ హాస‌న్ సినిమాకు స‌మ‌యాన్ని కేటాయిస్తూ వ‌స్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ముందుగా రామ్ చ‌ర‌ణ్‌తో చేస్తోన్న గేమ్ చేంజ‌ర్ విడుద‌ల‌వుతుంద‌ని సినీ స‌ర్కిల్స్ టాక్‌. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లోనే ఈ సినిమా రిలీజ్ ఉండే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని మీడియా స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

విశాల్‌కి షాకిచ్చిన మ‌ద్రాస్ హైకోర్ట్‌

తెలుగు, త‌మిళ సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో విశాల్ తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ చేయ‌టానికి స‌ర్వం సిద్ధ‌మైంది. అస‌లు పోటీలో ఉంటుద‌నుకున్న ఇత‌ర చిత్రాలు కూడా త‌ప్పుకోవ‌టంతో విశాల్ చాలా సంబ‌ర‌డ్డాడు. వినాయ‌క చ‌వితికి త‌న సినిమానే సోలో రిలీజ్ అని అనుకున్నారు. అయితే మద్రాస్ హైకోర్ట్ హీరోకి అనుకోని షాకిచ్చింది. ‘మార్క్ ఆంటోని’ సిినిమా రిలీజ్‌పై కోర్టు స్టే విధించింది. అందుకు కార‌ణం.. నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ గ‌తంలో త‌మ‌కు విశాల్ డ‌బ్బులు ఇవ్వాలంటూ కోర్టుకెక్కిన సంగ‌తి తెలిసిందే. వీరికి విశాల్ రూ. 21.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో రూ.15 కోట్లు క‌ట్టాల‌ని అప్ప‌ట్లో కోర్టు తీర్పు కూడా ఇచ్చింది.