English | Telugu

క్రిష్‌ చేతుల మీదుగా 'ద్రోహి' ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌

సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా ప్రొడక్షన్స్‌, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్‌  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ద్రోహి'. ది క్రిమినల్‌ అన్నది ఉపశీర్షిక. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి  విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు. 

విశాల్‌కి ప్రభాస్ వల్ల బాగా కలిసొచ్చింది!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న చిత్రాల్లోరిలీజ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న సినిమా ‘సలార్’. నిజానికి ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కావాల్సింది. కానీ వి.ఎఫ్‌.ఎక్స్ విష‌యంలో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ హ్యాపీగా ఫీల్ కాక‌పోవ‌టంతో పోస్ట్ పోన్ చేస్తున్నారు. మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఆ డేట్‌లో మిగ‌తా సినిమాలు రిలీజ్ అవుతుండ‌టంతో ఇక అధికారిక ప్ర‌క‌ట‌న ఒక‌టే మిగిలింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ‘సలార్’ అనుకోకుండా వాయిదా ప‌డ‌టం ఆయ‌న ఫ్యాన్స్‌ని కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ ఏం చేద్దాం ప‌రిస్థితులు అనుకూలించాలి.. ఔట్‌పుట్ బావుండాలిగా అని స‌రిపెట్టుకున్నారు.

పెళ్లైన హీరోయిన్‌తో హీరో సూర్య స‌ర‌సాలు!

డిఫ‌రెంట్ రోల్స్‌, మూవీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో త‌న‌దైన క్రేజ్ సంపాదించుకున్న వెర్స‌టైల్ హీరో సూర్య‌. ప్ర‌తీ సినిమాలోనూ ఆయ‌న ఏదో ఒక కొత్త‌ద‌నాన్ని చూపించ‌టానికి ఆరాట‌ప‌డుతుంటారు. ఆ దిశ‌గానే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ప్ర‌స్తుతం ఈయ‌న హీరోగా న‌టిస్తోన్న చిత్రం కంగువా. ఇదొక పీరియాడిక్ మూవీ. దీని త‌ర్వాత ఈయ‌న న‌టించ‌బోయే సినిమాలు చాలానే లైన్‌లో ఉన్నాయి. అందులో ముందుగా లేడీ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో మూవీ తెర‌కెక్క‌నుందని మీడియాలో వినిపిస్తోన్న టాక్‌. సూర్య 43గా రూపొంద‌నున్న ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం.

పాన్ ఇండియా మార్కెట్‌పై మ‌రోసారి నాని క‌న్ను

స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌ను ప‌క్క‌న పెడితే ఇప్పుడు మ‌న సౌత్ స్టార్స్ అంద‌రూ వ‌రుస పాన్ ఇండియా సినిమాలతో మార్కెట్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నాల‌ను గ‌ట్టిగానే చేస్తున్నారు. ఆ కోవ‌లో టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని కూడా ఉన్నారు. ఆయ‌న గ‌త చిత్రం ద‌సరాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ కాక‌పోయిన‌ప్ప‌టికీ నానికి మాస్ హిట్ ద‌క్క‌ట‌మే కాకుండా ఆయ‌న్ని వంద కోట్ల క్ల‌బ్ హీరోగానూ మార్చింది. ఇప్పుడు ఆయ‌న హాయ్ నాన్న సినిమా చేస్తున్నారు. డిసెంబ‌ర్ 21న‌ ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది.