English | Telugu
బొమ్మాళితో ఐదేళ్ళకో బొమ్మ.. హ్యాట్రిక్ అంటే ఇదేనమ్మ..!
Updated : Sep 11, 2023
లేడీ సూపర్ స్టార్ అనుష్క.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన మన బొమ్మాళి.. తన ఖాతాలో పలు హిట్ బొమ్మలని క్రెడిట్ చేసుకుంది.
ఇదిలా ఉంటే, ఆమధ్య సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన అనుష్క.. తాజాగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో పలకరించింది. యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టితో కలిసి స్వీటీ చేసిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ముంగిట మంచి ఫలితాన్నే రాబడుతోంది. ఈ సినిమాతో అనుష్కకే కాదు.. చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఖాతాలోనూ మరో హిట్ చేరింది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అనుష్క, యూవీ క్రియేషన్స్ కాంబోకి ఇది హ్యాట్రిక్ హిట్. గతంలో యూవీ క్రియేషన్స్ వారి తొలి చిత్రం 'మిర్చి'(2013)తో పాటు 'భాగమతి' (2018)లోనూ అనుష్క నాయికగా నటించింది. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' కూడా సక్సెస్ రూట్ లో వెళుతోంది. మొత్తమ్మీద.. బొమ్మాళితో ఐదేళ్ళకో బొమ్మ తీసి.. హ్యాట్రిక్ అంటే ఇదేనమ్మ అంటూ యూవీ క్రియేషన్స్ సంబరాలు చేసుకుంటోందన్నమాట.