English | Telugu

షాకింగ్ న్యూస్‌: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ డైరెక్టర్ మార్పు!

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడి స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటించారు. ఈ సినిమాను నవంబర్ 24న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి నిర్ణయించుకున్నారు అభిషేక్ నామా. ఈ సినిమాకు ముందుగా నవీన్ మేడారంను దర్శకుడిగా అనౌన్స్ చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆయన పేరు కనిపించటం లేదు. రీసెంట్ ప్రెస్ నోట్ ప్రకారం చూస్తే నవీన్ మేడారం పేరు దర్శకుడిగా ఎక్కడా ప్రస్తావన కాలేదు. ఆయన స్థానంలో అభిషేక్ నామా పేరు కనిపించింది. అంటే డెవిల్ సినిమాకు నిర్మాతే దర్శకుడిగా మారారు. మరి ఇలా జరగటానికి దర్శకుడికి, నిర్మాతకు మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చుననేది వినిపిస్తోన్న టాక్.

అయితే కళ్యాణ్ రామ్ వంటి పేరున్న హీరో సినిమా మేకింగ్‌లో ఇలా జరుగుతున్నప్పుడు ఆయనేమీ కల్పించుకోలేదా? అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మరి ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఇటు దర్శకుటు.. అటు ప్రొడ్యూసర్ ఏమీ రియాక్ట్ కాలేదు. వాళ్లు మాట్లాడితే కానీ అసలు విషయాలు బయటకు రావు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న మూవీ ఇది. ఇందులో కళ్యాణ్ రామ్ జోడీగా సంయుక్తా మీనన్ నటించింది. ఆమె ఇందులో నైషధ అనే పాత్రలో కనిపించనుంది.

1940 బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ ఈ సినిమా కోసం ఒకటి, రెండు కాదు, ఏకంగా 80 సెట్స్ వేశారు మేకర్స్. సినిమా మేకింగ్‌కి రూ. 35-40 కోట్ల మేరకు ఖర్చు అయ్యాయి. బడ్జెట్‌లో ఎక్కువ శాతం సెట్స్ కే ఖర్చు అయ్యాయనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.