English | Telugu
విన్నారా... త్రిష పోస్టుకు అర్థాలే వేరులే!
Updated : Sep 12, 2023
కొన్ని విషయాలు అలా జరిగిపోతుంటాయా? కావాలనే అలాగే జరిగేటట్టు ప్లానింగ్ చేసుకుంటారా? అంటే ఆన్సర్ చెప్పడం కష్టం. కానీ నెటిజన్లు మాత్రం అసలు విషయాన్ని గుర్తించారా? ఇక సందడికి ఏమాత్రం కొదవ ఉండదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్‌గా ఇలాంటి ఓ పని చేసి నెటిజన్లకు దొరికిపోయారు చెన్నై చంద్రం త్రిష. విజయ్ పక్కన ఆమె నటించిన లియో ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా నెట్టింట్లో కాస్త ఎక్కువగానే యాక్టివ్‌గా కనిపిస్తున్నారు త్రిష. ఈ నేపథ్యంలో ఆమె పలువురు పెట్టిన పోస్టులకు అకేషనల్‌గా స్పందిస్తున్నారు. రీసెంట్‌గా అలా ఆమె స్పందించిన ఓ పోస్టు వైరల్ అవుతోంది ``ఇటీవలే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా చూశాను. ఎంత మంచి సినిమా. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనిపిస్తోంది`` అంటూ హీరో విక్టరీ వెంకటేష్‌నీ, హీరోయిన్ త్రిషనీ ట్యాగ్ చేస్తూ దాదాపు పదేళ్ల క్రితం డైరక్టర్ శ్రీరాఘవ ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు ఇప్పుడు రిప్లై ఇచ్చారు త్రిష. నాక్కూడా చేయాలనిపిస్తోంది. నేను సిద్ధమే అంటూ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
`ఎంత తొందరగా స్పందించావు తల్లీ`అని ఒకరు చలోక్తులు విసిరితే, `ఎప్పటికైనా సీక్వెల్ చేయాల్సిన సినిమా` అని ఇంకొందరు స్పందిస్తున్నారు. అప్పట్లో హిట్ అయిన సినిమాల్లో సేమ్ జోడీ కలిసి నటిస్తే చూడ్డానికి మేం రెడీగా ఉన్నామని ఇటీవల గదర్2తో నిరూపించారు ఆడియన్స్. ఇప్పటికే డైరక్టర్ సీక్వెల్ గురించి మాట్లాడారంటే, కథాపరంగా ఏదో ఒక ఐడియా ఉండనే ఉండి ఉంటుంది. ఇంత బిజీలోనూ సినిమా చేయడానికి త్రిష సిగ్నల్ ఇచ్చేశారు. మెయిన్ హీరో వెంకటేష్ ఓకే అంటే వెంటనే ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నాయన్నది ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న మాట. చెప్పబోయే విషయాన్ని త్రిష ఇలా లీక్ చేశారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.