English | Telugu
అనుష్క అస్సలు డిజప్పాయింట్ చేయదన్న రవితేజ!
Updated : Sep 11, 2023
మాస్ మహారాజా రవితేజ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో అనుష్క ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'విక్రమార్కుడు' (2006) సంచలన విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే.. ఈ మూవీతోనే అనుష్కకి తొలి హిట్ దక్కింది. ఇందులో "జుమ్ జుమ్ మాయ జుమ్ జుమ్ మాయ" అంటూ రవి, స్వీటీ ఆడిపాడిన తీరుకి అప్పటి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'బలాదూర్' (2008) అంతగా ఆకట్టుకోకపోయినా.. పాటల్లో వీరి కెమిస్ట్రీ మాత్రం మస్త్ ఇంప్రెస్ చేసింది. రవితేజ, అనుష్క కాంబోలో మరో మూవీ వస్తే.. చూడాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో అనుష్క స్వల్ప విరామం తరువాత నాయికగా సందడి చేసింది. నవీన్ పొలిశెట్టితో కలిసి చేసిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ముంగిట మంచి వసూళ్ళని రాబడుతోంది. కేవలం ప్రేక్షకులనే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, సమంత వంటి ప్రముఖులను సైతం ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ రంజింపజేసింది. తాజాగా ఈ లిస్ట్ లో రవితేజ కూడా చేరారు. ఇటీవల ఈ మూవీ చూసిన రవితేజ.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'ని చూడడం చాలా ఆనందంగా ఉందని, నవీన్పొలిశెట్టి మరోసారి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. అలాగే అనుష్క అస్సలు డిజప్పాయింట్ చేయదని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అలాగే, దర్శకనిర్మాతలతో పాటు చిత్రబృందానికి ట్విట్టర్ వేదికగావిజయాభినందనలు తెలిపాడు రవితేజ.