English | Telugu
'డెవిల్' నుంచి సంయుక్త లుక్.. బర్త్ డే పోస్టర్ అదిరింది.. మరో బ్లాక్ బస్టర్ లోడింగ్!
Updated : Sep 11, 2023
తెలుగునాట వరుస విజయాలతో దూసుకుపోతున్న కథానాయికల్లో సంయుక్తా మీనన్ ఒకరు. 'భీమ్లానాయక్', 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' చిత్రాలతో నాలుగు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం 'డెవిల్' మూవీలో నటిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ పిరియడ్ డ్రామాలో.. నైషధ పాత్రలో కనిపించనుంది సంయుక్త. సోమవారం (సెప్టెంబర్ 11) సంయుక్తా మీనన్పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో.. సంప్రదాయ దుస్తుల్లో గుడికెళుతూ.. చిరునవ్వులొలికిస్తూ దర్శనమిచ్చింది సంయుక్త.
'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తరువాత కళ్యాణ్ రామ్ తో సంయుక్త జట్టుకట్టిన ఈ డిఫరెంట్ మూవీ కూడా.. మరో గ్రాండ్ సక్సెస్ ని అందిస్తుందేమో చూడాలి. అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న 'డెవిల్'కి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 24న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ భారీ బడ్జెట్ మూవీ తెరపైకి రానుంది.